
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వాని సర్దుబాటు బాటలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.కొద్ది రోజుల క్రితం తెలంగాణ బిల్లును ఈ సమావేశాలలోనే పెట్టకుండా ఉంటే బెటర్ అని వ్యాఖ్యానించిన అద్వాని తాజాగా చేసిన వ్యాఖ్యలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణ అంశంపై పార్లమెంటులో జరిగిన ఘటనలు దేశ ప్రతిష్టను దిగజార్చాయని ,పెప్పర్ స్ప్రే వల్ల సుష్మ స్వరాజ్ కళ్లు మండి నీళ్లు వచ్చాయని అద్వాని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులే లోక్ సభ వెల్ లోకి దూసుకురావడం తమను తీవ్ర దిగ్భ్రాంతిని కలగించిందన్నారు.తాము మూడు రాష్ట్రాలను ఇచ్చినప్పుడు ఎక్కడా వివాదాలు లేవని ఆయన అన్నారు. అద్వాని స్వరంలో మార్పు కనబడడం లేదూ!
0 Reviews:
Post a Comment