
తన రాజకీయ జీవితంలో ఇలాంటి పార్లమెంటును ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాంగ్రెస్ వారు తప్పులు చేస్తూ బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సభలు సక్రమంగా సాగడంలేదని, సమయం కూడా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు పెట్టడం, ఆమోదం పొందడం అసాధ్యమేనని అద్వానీ మాటల్లో స్పష్టమైనట్టు తెలంగాణ టీడీపీ నేతలు తెలిపారు. బిల్లుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని అరుణ్ జైట్లీ వారికి చెప్పారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని ప్రస్తావన లేదని, ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వాలని అద్వానీ, జైట్లీని కోరినట్లు నామా నాగేశ్వరావు చెప్పారు. అద్వానీ, జైట్లీలతో భేటీ అనంతరం నామా, ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. బీఏసీ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ మాటలను చూస్తే తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధిలేదని తెలుస్తోందని, న్యాయపరమైన అంశాలను అడ్డంపెట్టుకుని తప్పించుకునేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
‘కాంగ్రెస్‌కు రెండు ప్రాంతాల్లో నష్టం’
ఇన్ని రోజులు తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని వార్తలు గుప్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇతర కారణాలు చూపుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీ విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు తేవడం లేదనే సంగతి మంగళవారం బీఏసీ సమావేశంలో తేటతెల్లం అయిందన్నారు. చివరి నిమిషంలో ఇలా చేయడంతో సీమాంధ్రలో, తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్‌నాయకులు భావిస్తున్నారన్నారు. కానీ రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు.
బాబుకు ఢిల్లీలో ఏం పని?: నాగం
చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ చేరింది, తెలంగాణను అడ్డుకునేందుకేనని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే తాము ఢిల్లీనుంచి తిరిగి వెళ్తామన్నారు. తెలంగాణపై బీజేపీ నిర్ణయంలో మార్పు లేదని, ఢిల్లీలో మంగళవారం తెలంగాణ టీడీపీ నాయకులకు సైతం అద్వానీ ఇదే స్పష్టత ఇచ్చారని నాగం అన్నారు. అయినా, తెలంగాణ ఏర్పాటుపై తప్పుదోవపట్టించే ప్రకటనలు చేస్తూ, తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.బాబుకి కోల్‌కతా నుంచి నేరుగా ఢిల్లీ రావాల్సిన అవసరమేమిటని నాగం ప్రశ్నించారు
0 Reviews:
Post a Comment