
నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ తో డీల్ కుదుర్చుకున్నారని, తనకు మద్దతు ఇస్తే ఏభై ఐదు కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు.దీంతో రాజ్యసభ ఎన్నికల రగడ కొత్త మలుపు తిరగింది.ఆదాలకు తెలంగాణ లో భూములు ఉన్నాయని,అవి పోతాయని ఉద్యమం అంటున్నారని కూడా ఆనం ఆరోపిచారు.ఆదాల సమైక్యవాది కాదని,సమైక్యవ్యాధి అని ఆనం ఆరోపించారు.కాగా ఆదాల తనకు వై.ఎస్.ఆర్.కాంగ్ర్రెస్,సిపిఎం లతో పాటు సమైక్యవాదులంతా ఓటు వేస్తారని చెబుతున్నారు.అయితే సిపిఎం ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు దూరం గా ఉంటామని ప్రకటించింది.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఓటింగ్ లో పాల్గొంటుందా?లేదా అన్నది తేలియాల్సి ఉంది
http://kommineni.info/articles/dailyarticles/content_20140204_8.php
0 Reviews:
Post a Comment