Contact us

జగన్ ఓ అపరిచుతుడు
కర్నూలు, ఫిబ్రవరి 6 : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఓ అపరిచితుడని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. జిల్లాలోని ఆదోని ఆర్అండ్ఎమ్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్య ముసుగు వేసుకున్న విభజన వాది జగన్ అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కల ఎప్పటికీ నెరవేదని విమర్శించారు.జగన్ సీఎం అయితే ఆయన పాలన హిట్లర్, ముసోసలిన్ పాలనకంటే భయంకరంగా ఉంటుందని మారెప్ప వ్యాఖ్యానించారు.

0 Reviews:

Post a Comment