
కేంద్ర మంత్రుల బృందం తెలంగాణ అంశం పరిష్కారానికి కీలకమైన సిఫారస్ లు చేసింది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సిపారస్ చేసినట్లు సమాచారం. పదేళ్లపాటు యుటిగా ఉంచడం ద్వారా ఈ సమస్యకు తెరదించాలని కేంద్ర మంత్రులు భావిస్తున్నట్లు కనబడుతోంది.సీమాంద్ర కేంద్ర మంత్రులు దీనిపై ఒత్తిడి తెస్తున్నారు. కాగా కొత్త రాజధాని ఖర్చును కేంద్రమే భరించాలని, ఆదాయ వనరుల పంపిణీపై రెండు రాష్ట్రాల ఆదాయ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా సిఫారస్ చేసినట్లు చెబుతున్నారు.ఇది కొంతవరకు సీమాంద్రులను సంతృప్తి పరచవచ్చు .కాని తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తారు.ముఖ్యంగా హైదరాబాద్ ఎమ్.పిలు, ఎమ్మెల్యేలు,మంత్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.వారికి ఏలాంటి వెసులుబాటు ఉందో చూడాలి.
0 Reviews:
Post a Comment