Contact us

చాయ్ కాదు.. మోడీ రక్తాన్ని అమ్మి ఉండవచ్చు
'చాయ్ కాదు.. మోడీ రక్తాన్ని అమ్మి ఉండవచ్చు'
ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడటమే కాకుండా వ్యంగ్యాస్త్రాలను విసరడంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ పత్యేకమైన శైలి అని చెప్పవచ్చు. తాజాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై తనదైన శైలిలో లాలూ వ్యంగ్యాస్త్రాలను వదిలారు.
 
'అతను చాయ్ ఎక్కడ నుంచి అమ్ముతాడు.  రక్తాన్ని, మత ఘర్షణలు అమ్ముతాడు' అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు.  'అసలైన చాయ్ వాలా నేనే.. నరేంద్రమోడీ కాదు' అని లాలూ అన్నారు. నా బ్యాలంలో పాట్నా లో చాయ్ అమ్మినాను అని లాలూ తెలిపారు. 
 
నా చిన్నతనంలో పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఓ షాప్ వద్ద నా సోదరులతో కలిసి చాయ్ అమ్మాను అని మీడియాకు వెల్లడించారు. స్కూల్ కు వెళుతూనే చాయ్, బిస్కెట్ లు అమ్మాను అని తన పేదరికాన్ని హైలెట్ చేసేందుకు లాలూ ప్రయత్నించారు. రైళ్లలో మోడీ చాయ్ అమ్మారనే అంశంపై లాలూ అగ్రహం వ్యక్తం చేశారు. 
 
మార్చి 3 తేదిన ముజఫర్ నగర్ లో నిర్వహించనున్న సభకు సమాంతరంగా మరో సభను పెట్టడానికి అనుమతి కోసం ఆర్జేడీ దరఖాస్తు చేసుకుంది.

0 Reviews:

Post a Comment