Contact us

వై.కాంగ్రెస్ కాంగ్రేసేతర లౌకిక పార్టీ-
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని లౌకికవాద పార్టీగా సిపిఎం ప్రకటించింది. సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కరత్ ఈ విషయం వెల్లడిస్తూ,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను కాంగ్రెసేతర , లౌకిక పార్టీగానే,ప్రతిపక్ష పార్టీగానే పరిగణిస్తున్నామని కారత్ స్పష్టం చేశారు.అయితే రాష్ట్రంలో పొత్తులు పెట్టుకునేది,ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన వచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్,బిజెపియేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. టిడిపి ఇప్పటికే బిజెపివైపు మొగ్గు చూపుతున్నామని అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అన్న దానిపై వ్యాఖ్యానించడానికి ఇది సమయం కాదని కూడా ఆయన అనడం విశేషం.దీంతో సిపిఎం వచ్చే ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి

0 Reviews:

Post a Comment