
తెలుగుదేశం నేతలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ పై కొత్త ఆరోపణలు చేశారు.జగన్ జాతీయ నాయకులను కలిసి విభజనకు సహకరించాలని కోరుతున్నారని టిడిసి సీనియర్ ఎమ్మెల్యే కేశవ్, రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ ఆరోపించారు. గల్లీలో సమైక్య శంఖారావం అంటూ తిరుగుతూ, డిల్లీలో మాత్రం జగన్ విబజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని కేశవ్ ఆరోపించారు.పార్లమెంటులో ,డిల్లీలో జాతీయ నాయకులు కలుస్తున్న సందర్బంలో విబజనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. కాగా సి.ఎమ్.రమేష్ మాట్లాడుతూ జగన్ చేస్తున్నది చాలా ఘోరమైన తప్పిదమని, సమైక్యవాదంతో కాకుండా విభజన వాదంతో నాయకుల వద్ద మాట్లాడుతున్నారని విమర్శించారు.
0 Reviews:
Post a Comment