లోక్ సభలో గందరగోళం చోటు చేసుకున్నప్పుడు ఇద్దరు ఎమ్.పిలు మందా జగన్నాధం, టిడిపి ఎమ్.పి శివప్రసాద్ ల మద్య తీవ్ర వ్యాగ్యుద్దం జరిగింది. మందా జగన్నాధం ఒక దశలో శివప్రసాద్ ను అడ్డుకున్నారని అంటున్నారు. అయితే దౌర్జన్యం జరిగిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.కాని దానిని మందా జగన్నాధం తీవ్రం ఖండిస్తున్నారు. తాము ఎక్కడా దౌర్జన్యం చేయలేదని, బిల్లును చించి వేస్తూ సభ్యులకు అడ్డుపడుతుంటే,తాను వారించడానికి ప్రయత్నించానని, నిజానికి తనపైనే ఎవరో దౌర్జన్యం చేశారని,దానిని లోక్ సభ టీవీలో చూసి అది ఎవరన్నది తెలుసుకుంటానని అన్నారు.ఎమ్.పిలు నిరసన చెప్పడం తప్పుకాదని, కాని దౌర్జన్యంగా తెలంగాణ బిల్లును ఆపడమే తప్పు అని జగాన్నాధం అన్నారు.
0 Reviews:
Post a Comment