Contact us

తెలంగాణలో జగన్‌కి ఐదు ఎంపీ సీట్లు.?
తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయిపోయిందన్న ప్రచారం జరుగుతున్నా, పరిస్థితులు అదే రకంగా కన్పిస్తున్నా.. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మాత్రం తెలంగాణలో తమ పార్టీకి ఇంకా ఉనికి వుందనే భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఖచ్చితంగా 5 సీట్లు గెలుస్తామని జగన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఇడుపుల పాయలో వైఎస్సార్సీపీ ప్లీనరీ జరిగిన విషయం విదితమే. ఆ సమావేశంలో రెహమాన్‌, జనక్‌ప్రసాద్‌ తదితర నేతలు మినహా, చెప్పుకోదగ్గ నేతలెవరూ కన్పించలేదు. ఆ మాటకొస్తే, తెలంగాణలో వైఎస్సార్సీపీ జెండా పట్టుకు తిరిగే పరిస్థితే లేదు ఎవరికీ.
సమైక్య నినాదాన్ని నెత్తికెత్తుకోవడంతోనే తెలంగాణలో వైఎస్సార్సీపీకి గడ్డు కాలం ఎదురయ్యింది. ఇది పైకి కన్పిస్తున్న విషయం. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేం. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించి చోటు చేసుకునే పరిణామాలే రానున్న ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతాయి.
వైఎస్సార్సీపీ పరిస్థితుల్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, ఢిల్లీకి పయనమయ్యారు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన కీలక నేతలతో భేటీ అయి, సమైక్యవాదానికి మద్దతు కూడగడ్తానంటున్నారు వైఎస్‌ జగన్‌. ఇక, జగన్‌ని తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ప్రాంతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చిత్రీకరిస్తోన్న విషయం విదితమే.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్‌ జగన్‌, అన్నమాట ప్రకారం తెలంగాణలో ఉనికి చాటుకోగలరా.? ఏమో మరి.. కాలమే సమాధానం చెప్పాలి.
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/telangana-jagan-ki-5-mp-seats-50169.html#sthash.dwjj0pU6.dpuf

0 Reviews:

Post a Comment