Contact us

కనిమొళి ఆత్మహత్యాయత్నo?
తమిళనాడు ముఖ్యమైన రాజకీయ పార్టీలో కుటుంబ తగాదాలు ముదురుతున్నట్లుగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిది ఇంటిలో కలహాలు తీవ్రం అయ్యాయి.ఆయన కుమార్తె ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు ప్రచారం గుప్పుమంది. అన్న అళగిరికి ఆమె మద్దతు ఇస్తున్నారట. దీనిపై స్టాలిన్ కు మద్దతు ఇస్తున్న కరుణానిది కుమర్తెను మందలించారని సమాచారం.దాంతో అలకబూనిన కనిమొళి ఆత్మహత్య చేసుకోబోయిందని, స్పృహ తప్పి ఉన్న ఆమె ను ఆస్పత్రిలో చేర్చారని ప్రచారం . అయితే డి.ఎమ్.కె.వర్గాలు మాత్రం ఆ కధనాలను ఖండిస్తున్నాయి. కేవలం అస్వస్థత వల్లే ఆమె ఆస్పత్రరిలో చేరారని అంటున్నాయి. ఏది ఏమైనా కరుణానిదికి వృద్దాప్యంలో కష్టాలు ముసురుకున్నాయి.

Kommineni

0 Reviews:

Post a Comment